జీవితాంతం జిన్ పింగ్ పదవిలో కొనసాగేందుకు చట్ట సభ లో ఆమోదం!

వాస్తవం ప్రతినిధి: చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ జీవితాంతం ఇక అదే అత్యున్నత పదవిలో కొనసాగేందుకు వీలుగా రాజ్యంగ సవరణకు ఆ దేశ జాతీయ చట్ట సభ ఈ రోజు(ఆదివారం) ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తుంది. 3 వేల మంది సభ్యులు ఉండే కాంగ్రెస్ పీపుల్స్ నేషనల్(సీపీసీ) ఈ నిర్ణయాన్ని ఆమోదించడం లాంచన ప్రాయమేనన్నట్లు తెలుస్తుంది. సీపీసీ నిబంధనల ప్రకారం రెండు సార్లు కంటే ఎక్కువ సార్లు ఒకే వ్యక్తి అధ్యక్ష పదవిలో కొనసాగడానికి వీలు లేదు. అయితే ఇప్పుడు ఆ చట్టాన్ని సవరిస్తూ శాశ్వత కాలం జిన్ పింగ్ అధ్యక్ష పదవిలో కొనసాగడానికి వీలుగా ఆ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ నిర్ణయం నేపధ్యంలో జిన్ పింగ్ పై పలువురు నెటిజన్లు విమర్శలు కూడా చేసిన సంగతి తెలిసిందే.