చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

వాస్తవం ప్రతినిధి: చిత్తూరు జిల్లాలో  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం లో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల ప్రకారం..జిల్లాలోని బంగారుపాళ్యం మండలం మాదిగవాణి తోపు వద్ద జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సు-కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులను సదాశివ (52), గిరిజ (47), పలికల్ గట్టి (72), జప్పగట్టిగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదంపై మరింత సమాచారం అందాల్సి ఉంది.