కాజల్ నో చెప్పడంతో  రవితేజ చాలా ఫీల్‌ అయ్యాడట!

వాస్తవం సినిమా: రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే.  ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్రకు కాజల్‌ అయితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో స్వయంగా రవితేజ హీరోయిన్‌ కాజల్‌ను సంప్రదించాడట. శ్రీనువైట్ల దర్శకత్వంలో సినిమాను ఎంత మాత్రం తాను చేయను అని, ఆయన దర్శకత్వంలో చేయడం కంటే సినిమాలు చేయకుండా ఖాళీగా ఉండటం ఉత్తమం అంటూ వ్యాఖ్యలు చేసిందట. గతంలో రవితేజ, కాజల్‌ కలిసి నటించారు. ఆ చిత్రం కూడా పెద్దగా సక్సెస్‌ కాలేదు. ఆ కారణం వల్ల కూడా కాజల్‌ ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రంలో నటించేందుకు నో చెప్పి ఉండవచ్చు అనే గుసగుసలు వినిపస్తున్నాయి. సహజంగా రవితేజ హీరోయిన్స్‌ విషయాలను పెద్దగా పటించుకోడు. కాని కాజల్‌ ఈ చిత్రంకు బాగా సూట్‌ అవుతుందని భావించి ఆమెను సంప్రదించగా ఆమె షాక్‌ ఇచ్చింది. దాంతో రవితేజ చాలా ఫీల్‌ అయ్యాడు అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాజల్‌ నో చెప్పిన హీరోయిన్‌ పాత్రకు అను ఎమాన్యూల్‌ను ఎంపిక చేసిన విషయం తెల్సిందే.