రాజమండ్రి సమీపంలో ‘శ్రీనివాస కల్యాణం’ సెట్టింగ్

వాస్తవం సినిమా:  సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో  మరో సినిమా చేయడానికి దిల్ రాజు రంగంలోకి దిగారు. ఈ సినిమాకి ‘శ్రీనివాస కల్యాణం’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. వీరి కాంబినేషన్ లో  ఇంతకు ముందు తెరకెక్కిన ‘శతమానం భవతి’ ఫ్యామిలీ ఆడియన్స్ తో శభాష్ అనిపించుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నితిన్ .. రాశి ఖన్నా నాయకా నాయికలుగా నటిస్తున్నారు. రెండు కుటుంబాలు .. ఒక వివాహ బంధం చుట్టూనే ఈ కథ తిరుగుతుందట. ఆ కుటుంబాలకి సంబంధించిన భారీ ఇంటి సెట్స్ ను రాజమండ్రి సమీపంలో వేయించారు. ఈ ఇళ్లు ‘కూనవరం’లో వున్నట్టుగా కథ కొనసాగుతుంది. ప్రధాన పాత్రధారులంతా పాల్గొనగా, దాదాపు నెల రోజుల పాటు ఇక్కడ పెళ్లికి సంబంధించిన సన్నివేశాలను షూట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట.