బోరు బావిలో పడ్డ నాలుగేళ్ళ చిన్నారి

వాస్తవం ప్రతినిధి: మధ్యప్రదేశ్‌లోని దివాస్‌లో ప్రమాదవశాత్తు నాలుగేళ్ల చిన్నారి బోరు బావిలో పడిపోయినట్లు తెలుస్తుంది. వ్యవసాయ పొలం వద్ద చిన్నారి ఆడుకుంటుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. దీనితో వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ టీం కూడా సహాయక చర్యలలో పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఈ బోరు బావి లోతు 40 ఫీట్లు ఉంది. చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది.