దేశంలో పెరుగుతున్న అత్యంత సంపన్నులు!

వాస్తవం ప్రతినిధి:  దేశంలో అత్యంత సంపన్నులు పెరిగి పోతున్నారని ఒక సర్వే లో వెల్లడైంది. ప్రాపర్టీ కన్సల్టెంట్‌ నైట్‌ ఫ్రాంక్‌ వెల్లడించిన వెల్త్‌ రిపోర్ట్‌-2018 నివేదిక లో ఈ విషయాన్నీ వెల్లడించింది.  2017లో వీరి సంఖ్య మరింత పెరిగిందని ఆ నివేదిక తెలిపింది. దేశంలో రెండు వందల మంది దాకా ఉన్న అత్యంత సంపన్నులు (సూపర్‌ రిచ్‌) 500 మిలియన్‌ డాలర్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారని నివేదిక పేర్కొంది. అంతకుముందు ఏడాదిలో 170గా ఉన్న వీరి సంఖ్య 18 శాతానికి పెరిగిందని తెలిపింది. ఈ కేటగిరిలో చేరిన అత్యంత సంపన్నులను నైట్‌ ఫ్రాంక్‌ సంస్ధ డెమి బిలియనీర్లుగా పిలుస్తోంది. వీరి సంఖ్య పెరుగుతున్నది. 2017తో కలిపి ఐదేళ్ళలో 500 మిలియన్‌ డాలర్లు లేదా అంతకు మించిన సంపద కలిగిన భారరతీయులు సంఖ్య 43 శాతం పెరిగింది. రానున్న ఐదేళ్లలో మరో 70 శాతం పెరిగే అవకాశముందని నైట్‌ ఫ్రాంక్‌ అంచనా వేసింది. ఇదే సమయంలో పేదల సంఖ్య దయనీయంగా ఉంది. 2017లో 50 మిలి యన్‌డాలర్లు అంతకు మించి సంపద కలిగిన వారి సంఖ్య 2, 929 మందిగా ఉంది. 2022 నాటికి ఈ కేటగిరిలో భారతీయులు సంఖ్య 4,980కి చేరుకుంటుందని కన్సల్టెంట్‌ అంచనా వేసింది.