దిల్ రాజు నిర్మాణంలో అశోక్ గల్లా మొదటి సినిమా

వాస్తవం సినిమా:  గల్లా జయదేవ్ తనయుడు అశోక్ తెలుగు తెరకి త్వరలోనే పరిచయం కానున్నట్టు తెలుస్తోంది. అందుకోసంగా సన్నాహాలు ప్రారంభం అయ్యాయట.గుంటూరు ఎంపీగా రాజకీయాలను ప్రభావితం చేసిన వ్యక్తి గల్లా జయదేవ్. ఆయన నిన్న తెలుగుదేశం కార్యాలయానికి తన తనయుడు అశోక్ ను తీసుకుని వచ్చారు. మురళీమోహన్ తో పాటు అక్కడున్న వాళ్లంతా అశోక్ గల్లాను ఆప్యాయంగా పలకరించారు. అశోక్ గల్లా అభిరుచిని గురించి గల్లా జయదేవ్ ను అడిగారు. అతణ్ణి హీరోను చేయనున్నట్టు గల్లా జయదేవ్ చెప్పారు. సినిమా రంగానికి సంబంధించిన వివిధ కోర్సుల్లో అశోక్ గల్లా అమెరికాలో శిక్షణ తీసుకున్నాడని అన్నారు. అశోక్ గల్లా మొదటి సినిమాను దిల్ రాజు నిర్మిస్తారనీ .. రాజమౌళి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన ఆర్.కె. అనే యువ దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తాడని చెప్పారు. దాంతో అక్కడున్న వాళ్లంతా హీరోగా అశోక్ గల్లా రాణించాలనే అభిలాషను వ్యక్తం చేశారు. ఒకరకంగా చెప్పాలంటే కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో నట వారసుడు వచ్చేస్తున్నాడన్న మాట.