ఉక్కు,అల్యూమినియం పై సుంకాలను పెంచుతూ డిక్రీ పై సంతకం చేసిన ట్రంప్

వాస్తవం ప్రతినిధి: వాణిజ్య యుద్ధం తలెత్తుతుందనే హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాను అనుకున్న ఉక్కు,అల్యూమినియం పై సుంకాలను పెంచేశారు. దీనికి సంబందించిన టారిఫ్ డిక్రీ పై ఆయన తాజాగా సంతకాలు చేశారు. అయితే ఈ సుంకాల పెంపు నుండి కెనడా, మెక్సికోలను మాత్రం మినహాయించినట్లు తెలుస్తుంది. ఉక్కు,అల్యూమినియం పై సుంకాలను పెంచిన ట్రంప్ త్వరలో మరిన్ని సుంకాలు వుండగలవని హెచ్చరించారు. అంతేకాకుండా అమెరికా ఉత్పత్తులపై అధికంగా సుంకాలు విధించే దేశాల నుండి వచ్చే దిగుమతులపై మరిన్ని పన్నులు వుంటాయని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.  ఉక్కు, అల్యూమిని యం పరిశ్రమలకు చెందినవారితో సమావేశ మైన ట్రంప్‌ ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించారు.