విపక్ష సభ్యుల అందోళనల తో సోమవారానికి వాయిదా పడ్డ రాజ్యసభ

వాస్తవం ప్రతినిధి: విపక్ష సభ్యుల ఆందోళనల నేపధ్యంలో రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. పలు అంశాలపై విపక్ష సభ్యులు ఆందోళనతో సభ ను స్తంభింప చేయడం తో డిప్యూటీ చైర్మన్ కురియన్ సభ ను సోమవారానికి వాయిదా వేశారు. విభజన హామీలు నెరవేర్చాలని తెదేపా సభ్యులు ఆందోళన చేపట్టి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ నిరసన తెలిపారు. దీనితో డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ సభ్యులకు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు. ఈ ఉదయం కూడా రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించాలని తెరాస, ప్రత్యేక హోదా, విభజన హామీలు సాకారం చేయాలని తెదేపా సభ్యులు ఆందోళన చేయడంతో ఈ ఉదయం రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు 2.30 గంటలకు వాయిదా వేశారు. అనంతరం మధ్యాహ్నం సభ ప్రారంభం కాగానే సభ్యులు నినాదాలతో హోరెత్తించి సభా కార్యకాలపాలను అడ్డుకోవడంతో డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ సభను సోమవారానికి వాయిదా వేశారు.