‘నోటా’కి ఓటేసిన విజయ్ దేవరకొండ

వాస్తవం సినిమా: తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో సన్సేషన్ హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఓ రెండు సినిమాలు విడుదలకి ముస్తాబవుతున్నాయి. తమిళంలోను ఆయన ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది.విజయ్ దేవరకొండ తొలిసారి పొలిటికల్ జానర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్లుక్తో పాటు మూవీ టైటిల్ను అనౌన్స్ చేశారు.ఫస్ట్ లుక్ పోస్టర్ పొలిటికల్ లీడర్గా వైట్ అండ్ వైట్ ఖద్దర్ బట్టల్లో.. ‘నోటా’కి ఓటేసినట్లు వేలిపై ఇంక్ తో దర్శనం ఇస్తున్నాడు విజయ్ దేవరకొండ. జ్ఞానవేల్ రాజా సమర్పిస్తోన్న ఈ సినిమాకి ‘నోటా’ (ణోటా) అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఎన్నికల పరిభాషలో ‘నోటా’ అంటే .. ‘ఈవీఎం’లో సూచించిన అభ్యర్థులనెవరినీ నేను ఎన్నుకోవడం లేదంటూ ఓటర్ తన అభిప్రాయాన్ని తెలియజేయడం. విజయ్ దేవరకొండ ఇంతవరకూ చేసిన పాత్రలకి ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు. ఆయన జోడీగా మెహ్రీన్ నటిస్తుందనే సంగతి తెలిసిందే.