ఏప్రిల్‌ 29న 10లక్షల మందితో సభ: తలసాని 

వాస్తవం ప్రతినిధి: వచ్చే నెల 29న సికింద్రాబాద్ పరేడ్‌ మైదానంలో గొల్ల, కురుమల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలంగాణ పశుసంవర్ధక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ వెల్లడించారు. గొల్ల, కురుమ ప్రభంజనం పేరిట పది లక్షల మందితో సభ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. బహిరంగ సభ విషయమై యాదవ సంఘం ముఖ్య నేతలతో మంత్రి సమావేశం నిర్వహించారు. ముఖ్య నేతలంతా ఈ నెల 11వ తేదీ నుంచి జిల్లా, మండలాల్లో పర్యటించి సన్నాహక సమావేశాలు నిర్వహించాలని సూచించారు. వచ్చే నెల మొదటి వారంలో తాను కూడా జిల్లాల్లో పర్యటిస్తానని, బహిరంగ సభకు రావాలని త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానిస్తామని తలసాని తెలిపారు.