ఈ సినిమా కోసం ఇంకా ఎవరినీ సంప్రదించలేదు :మహి వి.రాఘవ్

వాస్తవం సినిమా: ‘ఆనందో బ్రహ్మ’ సినిమా విజయాన్ని తన ఖాతాలో వేసుకొన్న మహి వి.రాఘవ్ దర్శకత్వంలో ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసిన వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసుకుంటోన్న ఈ సినిమా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. రాజశేఖర్ రెడ్డి పాత్రకోసం మమ్ముట్టిని సంప్రదించారని, అందుకు ఆయన సుముఖతను వ్యక్తం చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఆయన భార్య పాత్ర కోసం కొంతమంది కథానాయికల పేర్లను పరిశీలించిన దర్శక నిర్మాతలు, నయనతారను ఎంపిక చేశారనే వార్తలు వచ్చిన నేపధ్యంలో తాజాగా ఈ విషయం గురించి దర్శకుడు మహి వి.రాఘవ్ స్పందించాడు. ఈ సినిమా కోసం ఇంకా ఎవరినీ సంప్రదించలేదనీ .. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాక నటీనటుల ఎంపిక మొదలుపెడతామని అన్నాడు. విజయ్ చిల్లా .. శశీదేవి నిర్మిస్తోన్న ఈ సినిమా, వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుందని చెప్పాడు.