రవితేజ జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్

వాస్తవం సినిమా: మాస్ మహరాజ్ రవితేజ తన మార్క్ వినోదానికి దూరం కాకుండా కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నాడు.తాజాగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా కి ఓకే చేశాడు. ఈ రోజు ఉదయం ఈ చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు జరుపుకొంది. ఈ చిత్రంలో రవితేజ జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్ ను సంప్రదించారట. దాదాపు ఆమె ఎంపిక ఖరారైపోయినట్టేనని అంటున్నారు. ఇప్పటికే ‘నాపేరు సూర్య’ .. ‘శైలజా రెడ్డి అల్లుడు’ వంటి మంచి ప్రాజెక్టులు చేస్తోన్న అనూ ఇమ్మాన్యుయేల్ కి, ఈ సినిమా మరింత హెల్ప్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సునీల్ కీలకమైన పాత్రను పోషించనున్న ఈ సినిమా .. యూఎస్ లో ఎక్కువభాగం షూటింగ్ జరుపుకోనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించనున్నాడు.