మాజీ జర్నలిస్ట్ నుంచి కొన్ని వివరాలను సేకరించిన ఈడీ అధికారులు

వాస్తవం ప్రతినిధి: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అక్కడ పని చేసిన మాజీ సీనియర్‌ జర్నలిస్టు వీర్‌ సంఘ్వీ నుంచి ఈడీ అధికారులు కొన్ని వివరాలను సేకరించినట్లు వెల్లడించారు. రెండు నెలలుగా ఐఎన్‌ఎక్స్‌ మీడియాలోని పలు అంశాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్న అధికారులు ఈ నేపధ్యంలో సంఘ్వీ నుంచి వివరాల్ని సేకరించి, రికార్డు చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరంను అరెస్టు చేసి, విచారిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆర్థిక వివరాలకు సంబంధించి సంఘ్వీని ప్రశ్నించినట్లు తెలిపారు. ఆయన 2008 వరకు మీడియాలో జర్నలిస్టుగా పనిచేసిన సంగతి తెలిసిందే.