ప్రధాని పట్ల గౌరవాన్ని ప్రదర్శించిన జవాన్…… జీతంలో కోత!

వాస్తవం ప్రతినిధి: ప్రధాన మంత్రి పట్ల ఒకింత అగౌరవాన్ని ప్రదర్శించినందుకు ఓ బీఎస్‌ఎఫ్‌ జవానుకు శిక్ష విదించారు ఉన్నతాధికారులు. అయితే అనంతరం ప్రధాని దృష్టికి ఆ విషయం వెళ్ళడం తో వెంటనే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారు. అసలు ఏం జరిగింది అంటే….ఫిబ్రవరి 21న ఉదయపు కవాతు కోసం పేర్లను పిలిచినపుడు ‘మోదీ కార్యక్రమం’ నిమిత్తం అంటూ సంజీవ్‌ కుమార్‌ అనే కానిస్టేబుల్‌ చెప్పారు. దానితో ఈ మాటలను ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. విచారణ అనంతరం… శిక్ష కింద వారం రోజుల వేతనాన్ని కోతవిధించాలంటూ నిర్ణయించారు. అయితే ఈ విషయం ప్రధాని దృష్టికి వెళ్ళడం తో వెంటనే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని సంబంధిత అధికారులను కోరడం తో వెంటనే ఆ ఉత్తర్వులను అధికారులు ఉపసంహరించుకున్నట్లు తెలుస్తుంది.