ప్రత్యేక హోదా పై డైరెక్టుగా ప్రధానిని టార్గెట్ చేసుకున్న కొరటాల

వాస్తవం సినిమా: ప్రత్యేక హోదాపై ఏపీ రగులుతోంది. పార్టీలతో పాటూ ప్రజలు కూడా కేంద్రంపై మండిపడుతున్న పరిస్థితి. ఇప్పుడు టాలీవుడ్ నుంచి హోదా పోరుకు మద్దతు పెరుగుతోంది. డైరెక్టర్ కొరటాల శివ కేంద్రం తీరుపై మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రధాని మోదీని నేరుగా టార్గెట్ చేశారు. . “ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి గతంలో ఇచ్చిన హామీలను మనమంతా కలిసి ప్రధాని నరేంద్ర మోదీకి గుర్తుచేసి, ఆయన్ను మనిషిగా మారుద్దాం. తెలుగు రాష్ట్రాలు భారత్‌లో అంతర్భాగం అని మీరు నిజాయితీగా భావిస్తున్నారా సార్?” అని ప్రశ్నించారు. కాగా, రెండు రోజుల క్రితం తన కొత్త చిత్రం ‘భరత్ అను నేను’ టీజర్‌ లో పాప్యులర్ అయిన ఓ డైలాగ్‌ ను కొరాటాల శివ తన సోషల్ మీడియాలో మోదీకి అన్వయించడం గమనార్హం. కొరటాల చేసిన పోస్ట్‌ ఇప్పుడు వైరల్ అవుతోంది. సరైన సమయంలో సరైన పోస్టును పెట్టారంటూ ఆయన్ను ప్రిన్స్ ఫ్యాన్స్ తో పాటు పలువురు ప్రశంసిస్తున్నారు