“నా పాత్రలో నేను లీనమై నటించా”: సాయి పల్లవి

వాస్తవం సినిమా : వాస్తవానికి తన పాత్రలో తాను లీనమై నటించానని, ఓ తల్లి లాగే తాను ఇందులో ఫీలయ్యానంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది. తమిళ భామ సాయి పల్లవి తన తాజా చిత్రం ‘కణం’ గురించి పలు విషయాలను ప్రస్తావించింది.ఈ సినిమా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పింది. ఇందులో తన కో-స్టార్ నాగశౌర్య అద్భుతంగా నటించాడని ఆమె కితాబిస్తోంది. ఈ సినిమా తల్లీ-కూతురు బంధంపై రూపొందిన అద్భుత చిత్రమని తెలిపింది సాయి పల్లవి.
సాయి పల్లవి మొదటి నుంచీ కథల ఎంపిక విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఆమె విజయానికి అదే తారకమంత్రం. హీరో నానితో చేసిన ‘ఎంసీఏ’ చిత్రం, వరుణ్ తేజ్‌తో చేసిన ‘ఫిదా’ చిత్రం రెండూ ఆ కోవలోకే వస్తాయి. తెలుగుతో పాటు అటు తమిళ, మలయాళం పరంగానూ ఈ యంగ్ నటికి ఈ మధ్య ఆఫర్లు బాగానే వస్తున్నాయి.