కార్తీ కి నార్కో పరీక్షలకు అభ్యర్ధించిన సీబీఐ

వాస్తవం ప్రతినిధి: మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడు కార్తీకి నార్కో విశ్లేషణ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రత్యేక కోర్టును సీబీఐ అభ్యర్థించింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఇటీవల కార్తీని సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. విచారణకు కార్తీ సహకరించడం లేదని.. ప్రశ్నలకు ‘డొంకతిరుగుడు’గా సమాధానాలిస్తున్నారని ఈ నేపధ్యంలో ఆయనకు నార్కో విశ్లేషణ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ ప్రత్యేక కోర్టు ని అభ్యర్ధించింది. సీబీఐ తాజా అభ్యర్థనతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటు కార్తీని కోర్టులో హాజరుపరిచే మార్చి 9న.. ఈ అంశాన్ని పరిశీలిస్తామని న్యాయమూర్తి సునీల్‌ రానా కూడా స్పష్టం చేసినట్లు తెలుస్తుంది.