ఏపీ మంత్రులు కామినేని, మాణిక్యాలరావు రాజీనామాలను ఆమోదించిన గవర్నర్

వాస్తవం ప్రతినిధి: ఏపీ కేబినెట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్‌, మాణిక్యాలరావు సమర్పించిన రాజీనామాలు ఆమోదం పొందాయి. బీజేపీ మంత్రుల రాజీనామాలు గవర్నర్ నరసింహన్ ఆమోదించినట్లు ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ వెల్లడించారు. ఈరోజు ఉదయం ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కామినేని, మాణిక్యాలరావు కలిసి తమ రాజీనామా లేఖలను సమర్పించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కామినేని, దేవాదాయ శాఖ మంత్రిగా మాణిక్యాలరావు సమర్థంగా పనిచేశారని చంద్రబాబు ప్రశంసించడం విదితమే.