ప్రేమించిన అమ్మాయి వివాహం చేసుకోమన్నందుకు కిరాతకంగా చంపి పూడ్చివేసిన ప్రియుడు

వాస్తవం ప్రతినిధి: ప్రేమించిన అమ్మాయి పెళ్ళి చేసుకోమన్నందుకు ఆ యువతిని అతి కిరాతకంగా చంపి పూడ్చివేశాడో కిరాతకుడు. ఈ ఘటన జిల్లాలోని మోత్కురు మండలం బుజిలాపురం గ్రామంలో చోటుచేసుకుంది వివరాల ప్రకారం.. ప్రేమ ఓ యువతి పాలిట మృత్యువుగా మారింది. జీవితాంతం తొడుగా ఉంటానని మాట ఇచ్చిన ప్రియుడే ఆమెను కడతేర్చాడు. బుజిలాపురం గ్రామానికి చెందిన నరేష్, భార్గవిలు ప్రేమించుకున్నారు. ఆ యువకుడు మాత్రం ప్రేమించినట్టు నటించి ఆమెను హత్య చేశాడు.
గత కొద్ది రోజులుగా ఆ యువతి పెళ్లి విషయం ప్రస్తావిస్తూ వచ్చింది. ఏదొకటి చెప్పి రోజు అలానే కాలయాపన చేసేవాడు నరేష్. నన్ను వివాహం చేసుకుంటావా లేదా అని భార్గవి నిలదీసింది. దీంతో కోపోద్రిక్తుడైన నవీన్ ప్రియురాలిని హత్య చేశాడు. అనంతరం తన వ్యవసాయ బావి వద్దనే యువతిని పూడ్చివేశాడు.యువతి తల్లిదందౄల పిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేసిన పోలీసులు యువతి మృతదేహాన్ని కనుగొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.