‘అహం బ్రహ్మాస్మి’హీరో విషయంలో క్లారిటీ ఇచ్చిన క్రిష్ 

వాస్తవం సినిమా: విభిన్న చిత్రాల దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న క్రిష్‌ గత సంవత్సరం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో కంగనా రనౌత్‌తో ‘మణికర్ణిక’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం ముగింపు దశకు చేరుకుంది. అతి త్వరలోనే సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ సమయంలోనే క్రిష్‌ తన తర్వాత సినిమా సన్నాహకంలో మునిగి పోయాడు. క్రిష్‌ తర్వాత సినిమా  ‘అహం బ్రహ్మాస్మి’  రూపొందనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో కథానాయకుడు ఎవరా అనే ఆసక్తి అందరిలోనూ రేకెత్తుతోంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ సినిమాలో కథానాయకుడిగా బాలకృష్ణ నటించనున్నారనీ .. ఆయనని క్రిష్ ఒప్పించడం జరిగిపోయిందని అంటున్నారు.

  ప్రస్తుతం బాలయ్య ‘ఎన్టీఆర్‌’ చిత్ర పనుల్లో ఉన్నాడు. ఆ సినిమా పూర్తి అయితే కాని మరో సినిమాను కమిట్‌ అయ్యే అవకాశం లేదు. ఇలాంటి సమయంలో క్రిష్‌కు బాలయ్య ఎలా ఓకే చెప్పాడు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరో వైపు బాలయ్యతో సినిమాను చేసేందుకు వినాయక్‌ కూడా కర్చిఫ్‌ వేసి మరీ ఎదురు చూస్తున్నాడు. ఈ సమయంలోనే క్రిష్‌తో బాలయ్య సినిమా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.