ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ల పై డిల్లీ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు

వాస్తవం ప్రతినిధి: ప్రదాని మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు లపై సోమవారం సాయంత్రం డిల్లీ లో నాలుగు గంటల సమయంలో పిసిసి అధ్యక్షులు డాక్టర్ రఘువీరారెడ్డి సారథ్యంలో పిసిసి బృంధం పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ .. రాష్ట్రంలో టిడిపి, కేంద్రంలో బిజెపి పార్టీలు అదికారంలోకి రావాలన్న లక్ష్యంతో ప్రధాని మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు లు ఇద్దరు కలసి 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా, తదితర ఎన్నో హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నను ఇంతవరకు ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయక పోవడంతో పాటు, రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలు చేయక పోవడం పై డిల్లీ లోని పార్లమెంటు రోడ్డు లో గల పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసామన్నారు. తమతో కలిసి వచ్చినవారందరితో డిల్లీ లో మూడు రోజులుగా దీక్ష, పార్లమెంటు ముట్టడి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి పళ్ళంరాజు, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రమరాజు,తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పంతంనానాజీ, ఉపాధ్యక్షుడు యస్ యన్ రాజా,పిసిసి కార్యదర్శి జంగా గౌతం, నాయకులు అంబటి రామకృష్ణ, శివాజీ, సుందర్ రావు,రత్నకుమార్, తదితరులు పాల్గొన్నారు.