శ్వేత సౌధం వద్ద ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి!

వాస్తవం ప్రతినిధి: అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం వద్ద ఒక వ్యక్తి ఆత్మహత్య కు పాల్పడిన ఘటన కలకలం రేగింది. వైట్ హౌస్ బయట శనివారం ఓ వ్యక్తి నాటు తుపాకీ తో వైట్ హౌస్ ముందుకు వచ్చి అకస్మాత్తుగా తనను తానూ కాల్చుకున్నాడు. దానితో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది. వైట్ హౌస్ వద్ద సుమారు వంద మంది గుమిగూడిన సమయంలో ఓ యువకుడు అకస్మాత్తుగా కాల్పులు జరిపాడు. అయితే అతడు ఎవరన్న విషయం ఇంకా వెల్లడి కాలేదు. ఈ ఘటనకు సంబంధించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ అయిన ఒక వీడియోలో ఎమర్జెన్సీ వాహ నాలు ఘటనా స్థలివైపు సైరన్లతో దూసు కొస్తుండగా ప్రజలు గందరగోళం తో పరుగులు తీస్తున్న దృశ్యాలు కన్పిస్తున్నాయి.