అజేయ క్షిపణి ని తయారు చేసిన రష్యా!

వాస్తవం ప్రతినిధి: ప్రపంచంలోని ఏ లక్ష్యాన్నైనా చేరుకోగల అజేయ క్షిపణిని తయారుచేశామని ఈ ఖండాంతర క్షిపణి ఏ లక్ష్యాన్నైనా చేదిస్తుంది అని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. ఇందులో హైపర్ సోనిక్ క్షిపణులు, అధునాతన జలాం తర్గాములు ఉన్నట్లు పుతిన్ చెప్పారు. అధ్యక్ష ఎన్నికలు సమీస్తుండటంతో పుతిన్ దేశ కొత్త అణ్వాయుధ సంపత్తి వివరాలను వెల్లడించారు. తాము అభివృద్ధి చేసిన క్షిపణిని ఏ రక్షణ వ్యవస్థా నిలువరించలేదని ఆయన ఒక ప్రసంగంలో చెప్పారు. ప్రసంగిస్తున్నప్పుడు కొత్త క్షిపణి దూసుకెళ్తున్న వీడియోను భారీ తెరపై ప్రదర్శించారు. ఈ అణ్వస్త్రం ప్రపంచంలోని ఏ రక్షణ వ్యవస్థనైనా నిర్వీర్యం చేయగలదన్నారు. తక్కువ ఎత్తు లో ప్రయాణించే ఈ క్షిపణిని శత్రువులు గుర్తించడం చాలా కష్టమన్నారు. రష్యాపై గానీ, తమ భాగస్వామ్య పక్షాలపై గానీ జరిగే ఏ అణుదాడి నైనా తమపై దాడిగానే భావిస్తామని ఈ సందర్భంగా పుతిన్ పేర్కొన్నారు.