సాహో కోసం హాలీవుడ్‌ మరియు బాలీవుడ్‌ టెక్నీషియన్స్‌

వాస్తవం సినిమా: యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో సుజీత్‌ ‘సాహో’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మొదటి నుండి కూడా ‘సాహో’ చిత్రంపై సినీ వర్గాల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మిస్తున్నట్లుగా మొదటే నిర్మాతలు వంశీ మరియు ప్రమోద్‌లు ప్రకటించారు. సినిమాను ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో తెరకెక్కించేందుకు మరింతగా ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఒక భారీ షెడ్యూల్‌ను చిత్ర యూనిట్‌ సభ్యులు నిర్వహించినట్లుగా తెలుస్తోంది.భారీ యాక్షన్‌ సీన్స్‌ను చిత్రీకరించేందుకు హాలీవుడ్‌ మరియు బాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ను ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. దాదాపు 40 కోట్ల బడ్జెట్‌తో ‘సాహో’ చిత్ర షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ కోసం అత్యాధునిక కెమెరాలను వాడటంతో పాటు అత్యున్నత లొకేషన్స్‌లో ఈ చిత్రాన్ని షూట్‌ చేశారని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ శ్రద్దా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. సినిమా పూర్తి అయ్యే వరకు ఏకంగా 200 కోట్ల బడ్జెట్‌కు ‘సాహో’ చేరే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు. వచ్చే సంవత్సరం సంక్రాంతికి సినిమాను విడుదల చేసేలా దర్శకుడు సుజీత్‌ ప్లాన్‌ చేస్తున్నాడు .