కేసిఆర్ ఫ్రస్టేషన్ తో మాట్లాడుతున్నారు : లక్ష్మణ్

వాస్తవం ప్రతినిధి: దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తృతీయ కూటమి ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని, అందుకు తానే నడుం బిగిస్తానని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గట్టి కౌంటరు ఇచ్చారు. కేసిఆర్ పెట్టబోయే ఫ్రంట్లకు టెంట్లు కూడా దిక్కు ఉండవని పంచ్ వేశారు. ఇలాంటి ఫ్రంటులు ఎన్నో వచ్చాయి.. పోయాయి అన్నది గుర్తుంచుకోవాలన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడిన లక్ష్మణ్ ..’70 ఏళ్లలో జరగని అభివృద్ధి మోడీ చేసి చూపారు. అందుకే ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ కి అనుకూల ఫలితాలు వచ్చాయి. కమ్యూనిస్టుల బెదిరింపు రాజకీయాలకు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. దేశంలో 21 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాము. కర్ణాటక లో కూడా బీజేపీ విజయం సాధించబోతున్నది. తెలంగాణ లో కూడా బీజేపీ గెలుస్తుందని కేసీఆర్ భయపడుతున్నాడు. అందుకే బీజేపీ పై విమర్శలు చేస్తున్నారు. త్రిపుర లో గతంలో ఒక్క ఎమ్మెల్యే లేకున్నా అధికారంలోకి వచ్చాము. ఇప్పుడు తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని కేసీఆర్ కు గుబులు పట్టుకుంది. ఫ్రస్టేషన్ తో కేసీఆర్ మాట్లాడుతున్నారు. ‘ అంటూ చెప్పుకొచ్చారు.