స్వల్ప అస్వస్థతత కు గురైన కేరళ ముఖ్యమంత్రి

వాస్తవం ప్రతినిధి: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. శనివారం తెల్లవారు జామున ఆయన స్వల్ప అస్వస్థతత కు గురికావడంతో చెన్నై అపోలో ఆసుపత్రి లో చేర్పించారు. అయితే ఆయన ఇన్‌ఫెక్షన్‌ కారణంగా భాధపడుతున్నారని ఈ నేపధ్యంలో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనకు వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఇంతవరకు ఆసుపత్రి నుండి ఎటువంటి అధికారిక బులిటెన్‌ విడుదల కాలేదు. దీనికి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.