శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు

వాస్తవం ప్రతినిధి: భారత బ్యాట్మింటన్ క్రీడాకారిణి తెలుగు తేజం పీవీ సింధు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొన్న అనంతరం మొక్కులు చెల్లించుకున్నట్లు తెలుస్తుంది. టిటిడి అధికారులు దగ్గరుండి సింధు తో పాటు ఆమె కుటుంబ సభ్యులకు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించి, స్వామివారి పట్టువస్త్రాలను, తీర్ధప్రసాదాలు అందజేశారు. అనంతరం సింధు మాట్లాడుతూ…. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని సింధు పేర్కొన్నారు. ఇటీవల సింధు తన పతాక రంగు ను మారుస్తానని ఆ విశ్వాసం నాకు ఉందని ప్రకటించిన సంగతి తెలిసిందే.