ధోనీ అనుభవాన్ని మార్కెట్ లో కొనలేము…అమ్మలేము: రవిశాస్త్రి

 వాస్తవం ప్రతినిధి: భారత క్రికెట్‌ జట్టు సారథి మహేంద్ర సింగ్‌ ధోనీకి ఉన్న అనుభవాన్ని మార్కెట్లో కొనలేము.. అలాగని అమ్మలేము అని టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి అన్నారు. ప్రస్తుత టీమిండియా జట్టులో ధోనీనే సీనియర్‌ ఆటగాడు అన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అతని అనుభవాన్ని మార్కెట్ లో కొనలేము…అమ్మలేము అంటూ కోచ్ రవి అన్నారు. అతని అనుభవాన్ని ఉపయోగించుకుని విరాట్‌ కోహ్లీ టీమిండియాకు అద్భుత విజయాలు అందిస్తున్నాడు అని విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఏడాది వెస్టిండీస్‌ పర్యటనలో ధోనీ పరుగులు రాబట్టడంలో విఫలం కావడంతో కొందరు మాజీ క్రికెటర్లు అతని స్థానంలో యువ ఆటగాడికి చోటు కల్పించాలంటూ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కోచ్ రవి తో పాటు కోహ్లీ ధోనీ కి అండగా నిలిచి వారి కామెంట్లు ని తిప్పి కొట్టారు.
అనంతరం బీసీసీఐ ప్రధాన సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ కూడా మాట్లాడుతూ.. 2019 ప్రపంచకప్‌ వరకు ధోనీ జట్టులో ఉంటాడని స్పష్టం చేశాడు. అయితే కోచ్ రవి కూడా ఎంతో అనుభవజ్ఞుడైన ధోనీ స్థానంలో మరొకరిని తీసుకురాలేం. ఇదేమీ మనకు మార్కెట్లో దొరకదు. కొనలేము.. అలాగని అమ్మలేము. ప్రపంచంలో నేను చూసిన గొప్ప వన్డే ఆటగాళ్లలో ధోనీ ఒకడు. అతని అనుభవం, ఫిట్‌నెస్‌, అన్ని విభాగాల్లో రాణించడం ఎంతో ప్రత్యేకం. అతనిలా గేమ్‌ను ముగించే వాళ్లు క్రికెట్‌ చరిత్రలో చాలా అరుదు. 5, 6, 7 ఇలా ఏ స్థానంలో పంపినా ధోనీ నుంచి వ్యత్యాసాలు కనిపిస్తాయి’ అని రవిశాస్త్రి వివరించాడు.