త్రిపుర లో సంబరాలు చేసుకుంటున్న బీజేపీ!

వాస్తవం ప్రతినిధి: త్రిపురలో భారతీయ జనతా పార్టీ కూటమి స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకేలుతున్న నేపధ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. అగర్తలలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ విజయోత్సవాలు చేసుకుంటున్నారు. త్రిపురలో భాజపా, ఐపీఎఫ్‌టీ కూటమి 42 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండడం తో మాణిక్‌ సర్కార్‌ కూటమి కి చెక్ పట్టినట్లు అయ్యింది. గత ఐదు పర్యాయాలుగా వామపక్ష పార్టీలకు కంచుకోటగా ఉన్న త్రిపురలో ప్రస్తుతం ఈ కూటమి 16 స్థానాల్లో ముందంజ లో ఉండడం తో భాజపా వారికి గట్టి షాక్‌ ఇచ్చింది.