ఆర్టీసి బస్సు, కారు ఢీ..5గురు దుర్మరణం

వాస్తవం ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా కంది మండలం ఐఐటి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రుద్రారం వైపు నుంచి అతి వేగంగా వస్తున్న కారు టీఎస్ 15ఇ 8699 డివైడర్ ను ఢీ కొని సంగారెడ్డి వైపు నుంచి వస్తున్న బస్సు కిందికివెళ్లింది. ఈ సంఘటనలో ఐదుగురు మరణించారు. ప్రమాదం జరిగినవెంటనే ముగ్గురు మరణించగా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుప్రతికి తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయారు. బస్సులో ప్రయాణిస్తూ గాయపడిన 30 మందిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తు న్నారు. ప్రమాదంలో కారుపూర్తిగా నుజ్జునుజ్జు అయింది. కారులో ప్రయాణిస్తున్నవారు రుద్రారంలో జరిగిన హోలీ సంబరాల్లో పాల్గొని తిరిగి సంగారెడ్డి వెళు తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో రాజు, మహేశ్, నరేంద్ర వెంకట్తో పాటు మరొకరు మృతి చెందారు. సమాచారం అందుకొని ఘటనా స్తహ్లికి చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.