అగ్రరాజ్యంలో మరోసారి కాల్పుల కలకలం…..ఇద్దరు మృతి!

వాస్తవం ప్రతినిధి: అగ్రరాజ్యం అమెరికా లో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. అమెరికాలోని సెంట్రల్ మిషిగన్ యూనివర్సిటీ వసతిగృహం క్యాంబెల్ హాల్‌లో శుక్రవారం కాల్పుల ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ కాల్పుల్లో ఇద్దరు మృతిచెందినట్లు తెలుస్తుంది. 19 ఏండ్ల వయసున్న ఓ యువకుడు ఆయుధంతో వసతిగృహంలోకి ప్రవేశించి కాల్పులకు తెగబడినట్లు సమాచారం. కాల్పులు జరిగిన వెంటనే యూనివర్సిటీ అధికారులు అప్రమత్తమై,కాల్పుల విషయాన్ని విద్యార్థులకు చేరవేశారు. అయితే ఈ కాల్పులకు పాల్పడింది జేమ్స్ ఎరిక్ డెవిస్ జూనియర్‌గా భావిస్తున్నామని అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.దీనికి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.