విశాఖ లో బీజేపీ నాయకుల కీలక సమావేశం!

వాస్తవం ప్రతినిధి: రేపు విశాఖ లో బీజేపీ నాయకులు కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సి వ్యూహంపై ఈ సమావేశం లో కీలకంగా చర్చించనున్నట్లు తెలుస్తుంది. బీజేపీ ఎపి అధ్యక్షుడు హరిబాబు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. ఇంకా ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.