రాయలసీమ కుర్రాడిగా రాజ్ తరుణ్

వాస్తవం సినిమా: ప్రస్తుతం రాజ్ తరుణ్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో ‘లవర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ రాయలసీమ కుర్రాడిగా కనిపిస్తాడట. ఆయన లుక్ .. బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ గా వుంటాయని అంటున్నారు. కథాపరంగా ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా అనంతపురంలో జరుగుతోంది. రాజ్ తరుణ్ సరసన రిద్ధి కుమార్ కథానాయికగా నటిస్తోంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమాను, జూన్ 14వ తేదీన విడుదల చేయనున్నారు. కొంతకాలంగా సరైన హిట్ లేక డీలాపడిన రాజ్ తరుణ్, ఈ సినిమా సక్సెస్ పై ఆశలు పెట్టుకున్నాడు. ఇక తొలిపరిచయంగా రిద్ధికుమార్ కి ఈ సినిమా ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి.