ప్రధాని ని అవమానించాలన్న ఉద్దేశ్యం లేదు: ఎంపీ కవిత

వాస్తవం ప్రతినిధి: ప్రధానిని అవమానించాలనే సంకుచిత ఉద్దేశం మాకు లేదని తెలంగాణా ఎంపి కవిత స్పష్టం చేశారు. ఇటీవల రైతుల సదస్సు లో భాగంగా తెలంగాణా సీ ఎం కేసీఆర్ ప్రధాని మోదీ ని ఏకవచనం తో సంబోదించారు అంటూ కేంద్ర రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఒక రాష్ట్రానికి సి ఎం గా ఉన్న వ్యక్తి ప్రధాని ని ఏకవచనం తో సంబోదించడం సరికాదని ఆమె చాలా బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో ఇప్పటికే కేసీఆర్ వ్యాఖ్యలు ఉద్దేశ్య పూర్వకంగా వచ్చినవి కావని పొరపాటున దొర్లిన సంబోధన అని వివరించారు. అయితే తాజాగా ఎంపీ కవిత కూడా విలేఖరుల సమావేశం లో మాట్లాడుతూ …ప్రధాని మోదీ పై వ్యాఖ్యలు కేవలం మాటల్లో దొర్లిన తప్పిందమని, చిన్న పొరపాటుపై బిజెపి అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆమె అన్నారు. మొన్న ప్రధాని దావోస్ లో భాగంగా మాట్లాడుతూ 600 కోట్ల మంది నాకు ఓటేశారని అన్నారు కానీ దేశంలో 130 కోట్ల మందే ఉన్నారు. తప్పులు దొర్లడం సహజమే అని కవిత ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతుల కష్టాలపై ఆవేదనతో కెసిఆర్‌ కాస్త కటువుగా మాట్లాడారు అని సిఎం చంద్రశేఖరరావును ఎంపి కవిత వెనుకేసుకొచ్చారు. ఎపికి ప్రత్యేక హోదా కోసం 2014 నుంచి మద్దతిస్తున్నామన్నారు. విభజన చట్టంలోని ప్రతి హామీని కేంద్రం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పార్లమెంట్‌లో గట్టిగా నినదిస్తామని కవిత స్పష్టం చేశారు.