పీ ఎస్ ఎల్ లో ఆడనున్న కోహ్లీ!

వాస్తవం ప్రతినిధి: భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో ఆడుతున్నట్లు వార్తలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. కోహ్లీ ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకుంటున్నాడు. మరి అలాంటిది పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌)లో కోహ్లీ అని ఎందుకంటున్నామంటే పీఎస్‌ఎల్‌లో విరాట్‌ కోహ్లీ ఆడాలని పాక్‌ అభిమానులు కోరుతున్నారట. మ్యాచ్‌ జరిగే సమయంలో ‘పీఎస్‌ఎల్‌లో కోహ్లీని చూడాలనుకుంటున్నాం’ అని అభిమానులు ప్లకార్డులు ప్రదర్శించారు. దీనితో ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారడం తో కోహ్లీ పీఎస్ ఎల్ లో ఆడుతున్నట్లు వార్తలు హాల్ చల్ చేస్తున్నాయి. పీఎస్‌ఎల్‌-3లో మ్యాచ్‌లు ప్రస్తుతం యూఏఈలో జరుగుతోన్న సంగతి తెలిసిందే. ప్రేక్షకాదరణ లేక స్టేడియాలు వెలవెలపోతున్న ఫొటోలు గత రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కోహ్లీ ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. సఫారీ పర్యటనను విజయవంతగా ముగించుకుని వచ్చిన కోహ్లీ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. శ్రీలంక-భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య జరిగే ముక్కోణపు టీ20 సిరీస్‌ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. దీంతో రోహిత్‌ శర్మకు నాయకత్వ బాధ్యతలు అందాయి. ఈ నెల 6 నుంచి టీ20 టోర్నీ ప్రారంభంకానుంది.