స్పాట్ ఫిక్సింగ్ కారణంగా పాక్ క్రికెటర్ పై వేటు

వాస్తవం ప్రతినిధి: స్పాట్‌ ఫిక్సింగ్‌ పాల్పడ్డ కారణంగా మరో పాక్ క్రికెటర్‌పై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) నిషేధం విధించింది. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో క్రికెటర్‌ షహజైబ్‌ హసన్‌కు పీసీబీ అవినీతి నిరోధోక ట్రైబ్యునల్‌ ఏడాది పాటు నిషేధం విధించింది. షర్జీల్‌ ఖాన్‌, ఖలిద్‌ లతీఫ్ తర్వాత ఈ వ్యవహారంలో నిషేధానికి గురైన మూడో క్రికెటర్‌ హసన్‌ కావడం గమనార్హం. గతేడాది జరిగిన పీఎస్‌ఎల్‌ రెండో సీజన్‌లో ఈ ఫిక్సింగ్‌ వ్యవహారం బయటపడగా నిషేదానికి గురైన మూడో క్రికెటర్ గా హాసన్ నిలిచాడు. హసన్‌ 2009లో టీ20 ప్రపంచకప్‌ గెలిచిన పాక్‌ జట్టులో సభ్యుడు. పీఎస్‌ఎల్‌లో కరాచీ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతడిపై 2017 మార్చిలో ఛార్జ్‌షీట్‌ దాఖలైంది. హసన్‌ను స్పాట్‌ ఫిక్సింగ్‌ నేరంలో శిక్షించలేదని ఆలస్యంగా ఫిక్సింగ్‌ విషయాన్ని బోర్డుకు తెలియజేయడంతో నిషేధించారని అతడి తరఫున న్యాయవాది వెల్లడించారు. 2017 మార్చి నుంచే నిషేధం అమల్లోకి వస్తుందని దీనిపై పైకోర్టుకు అప్పీల్‌ చేయాలా లేదా అనేది ఇంకా నిర్ణయించుకోలేదని ఆయన పేర్కొన్నారు.