‘రంగస్థలం’ నుంచి రేపు సెకండ్ సాంగ్ రిలీజ్

వాస్తవం సినిమా: రంగస్థలం చిత్ర విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్లను వేగవంతం చేసేశారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మొదటి పాటకు అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక ‘రంగా .. రంగా .. రంగస్థలాన ..’ అనే రెండవ సాంగ్ ను రే ‘రంగస్థలం’ నుంచి రేపు సెకండ్ సాంగ్ రిలీజ్ పు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా తాజాగా వదిలారు. లవ్ .. మర్డర్ మిస్టరీ .. రాజకీయాల నేపథ్యంలో ఆసక్తికరమైన మలుపులతో ఈ సినిమా కొనసాగుతుందని అంటున్నారు. త్వరలో వైజాగ్ లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా .. ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఈ మేరకు మేకర్లు ఓ చిన్న వీడియోను వదిలారు. అంతకు ముందు ముందుగా ఎంత సక్కగున్నావే పాటను లెజెండరీ తార శ్రీదేవికి అంకితమిస్తున్నట్లు ప్రకటించిన చిత్ర యూనిట్‌.. పాటను అంతగా ఆదరించినందుకు దర్శకుడు సుకుమార్‌, రైటర్‌ చంద్రబోస్‌లు శ్రోతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆపై మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవీశ్రీప్రసాద్‌ సెకండ్‌ సాంగ్‌ రికార్డింగ్‌కు సంబంధించిన దృశ్యాలను చిన్న బైట్‌ రూపంలో విడుదల చేశారు.
మైత్రిమూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌, సమంత, జగపతి బాబు, ఆది, అనసూయ తదితరులు నటిస్తుండగా.. మార్చి 30న రంగస్థలం ప్రేక్షకుల ముందుకు రానుంది.