దుమారం రేపుతున్న టర్కీ ప్రభుత్వ ఛానెల్‌ అకిట్‌ టీవీ యాంకర్‌ వ్యాఖ్యలు

వాస్తవం ప్రతినిధి: ఓ టీవీ చర్చా వేదికలో రాజకీయ నేతలను ఉద్దేశించి యాంకర్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘సాధారణ పౌరుల ప్రాణాలు తీసే ముందు రాజకీయ నేతలను చంపాలి’ అని వ్యాఖ్యానించి చిక్కుల్లో పడ్డాడు. టర్కీ ప్రభుత్వ ఛానెల్‌ అకిట్‌ టీవీ యాంకర్‌ అహ్మత్‌ కేసర్‌ తాజాగా ఓ చర్చా కార్యక్రమం నిర్వహించాడు. దీనికి ప్రధాన-ప్రతిపక్ష నేతలు కొందరు హాజరయ్యారు. ప్రస్తుతం సిరియా నెత్తురోడుతున్న ఈ నేపథ్యంలో ఉత్తర సిరియాపై ఉగ్రస్థావరాల మీద దాడుల కోసం టర్కీ సహకారం అందించటాన్ని నేతలంతా ముక్తకంఠంతో ఏకీభవించారు.