క్రికెట్ ఆడిన కరుణానిధి

వాస్తవం ప్రతినిధి:తమిళ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం తనదైన ముద్రవేసిన డీఎంకే అధినేత, భారత రాజకీయాల్లో కురువృద్ధుడి వంటి కరుణానిధి ఏం చేసినా సంచలనమే. వయసు మీద పడడంతో ఇంటికే పరిమితం అయిన మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తాజాగా ఆయన తన మనవడితో క్రికెట్ ఆడిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే మైదానంలో కాదు. తన నివాసంలోనే. కరుణానిధి తన చక్రాల కుర్చీలో కూర్చుని బౌలింగ్‌ చేస్తుంటే.. ఆయన మునిమనవడు బ్యాటింగ్‌ చేశాడు. పక్కనే ఉన్న ఇద్దరు మహిళలు బాల్‌ అందిస్తున్న ఈ దృశ్యాన్ని ఇంట్లో వారు వీడియో తీయడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. కరుణానిధి ఆరోగ్యం విషయమై వస్తున్న వదంతుల నేపథ్యంలో ఈ వీడియో అభిమానులకు ఊరటనిచ్చింది.