ఈ ఫొటోలోని బాలీవుడ్ హీరోయిన్‌ని గుర్తు పట్టారా?

వాస్తవం సినిమా: ఈ ఫొటోలోని బాలీవుడ్ హీరోయిన్‌ని గుర్తు పట్టారా? తాజాగా ఈమె ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఇంతకీ ఎవరామె అంటారా..? అదేనండీ ఆమె బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ. ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్సులోనే కనపడుతూ కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసే అనుష్కశర్మ ఇలా కాటన్ చీరలో, చేతికి మట్టి గాజులతో దిగాలుగా కూర్చుని అభిమానులు గుర్తు పట్టలేనంతగా ఉంది. అనుష్కశర్మ న‌టిస్తోన్న ‘సూయి ధాగా’ సినిమాలోని ఈ లుక్‌ బయటకు వచ్చింది..ఫస్ట్‌లుక్‌తోనే ఈ సినిమా అందరి దృష్టినీ ఆకర్షించింది. ‘సూయి ధాగా’ సినిమాలో వరుణ్ ధావన్, అనుష్క శర్మ ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన దంపతులుగా నటిస్తున్నారు. అందుకే ఈ ముద్దుగుమ్మ ఇలా కనపడుతోంది.