సినీరంగ ప్రవేశం చేస్తున్న శ్రీకాంత్- ఊహల చిన్న తనయుడు

వాస్తవం సినిమా: హీరో శ్రీకాంత్-ఊహలకు మొత్తం ముగ్గురు సంతానం. వీరిలో పెద్ద కుమారుడు రోషన్ ఇప్పటికే సినిమాల్లో నటించాడు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమదేవి సినిమాలో నటించాడు. దీంతోపాటు నిర్మలా కాన్వెంట్ లోనూ హీరోగా నటించాడు. కుమార్తె మేధ కూడా రుద్రమదేవితోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు చిన్నకొడుకు కూడా సినిమాల్లోకి అరంగేట్రం చేయబోతున్నాడు.

సీనియర్ హీరో శ్రీకాంత్- ఊహల చిన్న తనయుడైన రోహన్ సినిమాల్లోకి అడుగు పెడుతున్నాడు. రోహన్ నటించబోతున్న సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం.. హిందీ భాషల్లోనూ విడుదల కానుంది. ఇందులో ప్రభుదేవా కీలక పాత్ర చేస్తున్నాడు. అతడికి ఈ మూడు భాషల్లోనూ మంచి ఇమేజ్ ఉండటంతో ఈ సినిమా కూడా మూడు భాషల్లోనూ విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. పాషన్ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కే ఈ సినిమాకు కొత్త దర్శకుడు ఆకాష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఓ హిల్ ఏరియా బ్యాక్ డ్రాప్ తో ఈ మూవీ ఉంటుందని కోలీవుడ్ టాక్. ఇప్పటికే ఊటీలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసేశారని తెలుస్తోంది.