మాక్రాన్ కు క్రమంగా తగ్గుతున్న ప్రజాదరణ!

వాస్తవం ప్రతినిధి: ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌కు లభిస్తున్న ప్రజాదరణకు క్రమంగా తగ్గిపోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌లో ఇదే విషయం తేటతెల్లమౌతుంది. ఈ తాజా ఒపీనియన్ ప్రకారం ప్రజామోదం 50 శాతానికి తక్కువగా నమోదు కావటం విశేషం. గత ఏడాది అక్టోబర్‌లో లభించిన ప్రజామోదానికి ఇది అత్యంత కనిష్టస్థాయిలో వున్నట్లు తెలుస్తోంది. ఫ్రాన్స్‌ ప్రభుత్వ సేవలను వ్యయభరితం చేసేందుకు మాక్రాన్‌ సర్కారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సమయంలో ఆయనకు లభిస్తున్న ప్రజామోదం దిగజారుతుండటం గమనార్హం. గత జనవరిలో నిర్వహించిన ఒపీయిన్‌ పోల్‌లో 50 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా కేవలం నెలరోజుల వ్యవధిలో ఆరుశాతం మేర పడిపోవటం విశేషం.