మణిపూర్ లో బీజేపీ కి పెద్ద షాక్!

వాస్తవం ప్రతినిధి: భారతీయ జనతా పార్టీకి మణిపూర్ లో పెద్ద షాక్‌ తగిలింది. అక్కడ మిత్రపక్షం గా ఉన్న నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌(ఎన్‌పీఎఫ్‌) ఎన్డీఏ కూటమికి గుడ్‌ బై చెప్పేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది.  ఈ మేరకు మణిపూర్‌ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఎన్‌పీఎఫ్‌ తన మద్ధతు ఉపసంహరించుకున్నట్లు ఆ రాష్ట్ర అధ్యక్షుడు మురంగ్ ముకంగా ఆదివారం ప్రకటించారు. దీనితో బీజేపీ ప్రభుత్వంలో వణుకు మొదలైంది. మణిపూర్‌ అసెంబ్లీలో మొత్తం 60 సీట్లు ఉండగా.. బీజేపీకి 31 మంది ఎమ్మెల్యేలు(వీరిలో 9 మంది కాంగ్రెస్‌ నుంచి, ఒకరు ఏఐటీసీ నుంచి ఫిరాయించిన వారు , ఎన్‌పీఎఫ్‌ తరపున నలుగురు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్ధతు ఇస్తున్నారు. ఈ పరిస్థితులలో ఎన్‌పీఎఫ్‌ గనుక మద్ధతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితులు ఎదురుకావొచ్చు.