పోలీసులకు లొంగిపోయిన ఎంఎల్‌ఎ కుమారుడు

వాస్తవం ప్రతినిధి: బెంగుళూరులోని ఓ పబ్ దగ్గర యువకుడిని చావబాదిన కేసులో ఎమ్మెల్యే ఎన్ఏ హార్రిస్ కుమారుడు మహ్మద్ నలాపాడ్ పోలీసుల ముందు లొంగిపోయాడు. వివరాలప్రకారం..కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే హ్యారిస్ కుమారుడు, బెంగళూరు యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మహమ్మద్ నలపాడ్ ఓ రెస్టారెంట్‌లో చెలరేగిపోయాడు. పదిమంది స్నేహితులతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లిన ఆయన నానా హంగామా చేశాడు. విద్వత్ అనే వ్యక్తిని చితకబాదాడు. తీవ్రంగా గాయపడిన విద్వత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నలపాడ్, అతడి స్నేహితులపై కేసు నమోదు చేశారు.

ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు నిందితుడు యూత్‌ కాంగ్రెస్‌ నేత కావడంతో అతనిని అదుపులోకి తీసుకోలేదు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ అతనిని ఆరేళ్ల పాటు సస్పెండ్‌ చేసినట్లు ప్రకటించింది. తన కుమారుడిని పార్టీ నుంచి బహిష్కరించడంపై ఎమ్మెల్యే హ్యారిస్ మాట్లాడుతూ ఇది చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. విషయం తెలిసి బాధిత కుటుంబాన్ని తాను పరామర్శించినట్టు చెప్పారు.
తాజా సమాచారం ప్రకారం ఎమ్మెల్యే ఎన్ఏ హార్రిస్ కుమారుడు మహ్మద్ నలాపాడ్ పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈఘటనలో తీవ్ర గాయాలపాలైన విద్వత్‌ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.