న్యాయవ్యవస్థ, సైన్యం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన షరీఫ్

వాస్తవం ప్రతినిధి: ఇటీవల పనామా పత్రాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపధ్యంలో తన పదవిని కూడా కోల్పోయిన పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ న్యాయవ్యవస్థ, సైన్యం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  న్యాయ వ్యవస్థ, సైన్యం తన శత్రువులని షరీఫ్‌  వ్యాఖ్యానించారు. ఆ రెండు వ్యవస్థలు తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నాయని షరీఫ్ ఆరోపించారు. అయినా వాటి గురించి తానేమీ భయపడబోనని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. వారి నుంచి ఎలాంటి కుట్రనైనా ఎదుర్కొనడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని షరీఫ్ అన్నారు.