తొలి టీ-20 లో ఘనవిజయం సాదించిన కోహ్లీ సేన

వాస్తవం ప్రతినిధి: భారత్-దక్షిణాఫ్రికా ల మధ్య జరిగిన తొలి టీ-20 లో కోహ్లీ సేన వండర్ చేసింది. అటు బ్యాటుతో ఇటు బంతితో మాయ చేసి సఫారీ లను వారి సొంత గడ్డ పైనే ఓడించింది. ఛేదనకు అచ్చొచ్చిన సొంతగడ్డపై దక్షిణాఫ్రికాను 28 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ప్రత్యర్థిని శిఖర్‌ ధావన్‌ బ్యాటింగ్‌తో జడిపించగా ‘స్వింగ్‌ కింగ్’‌‌ భువనేశ్వర్‌ బంతితో వణికించాడు. వీరిద్దరూ మూడు టీ20ల సిరీస్‌లో భారత్‌కు 1-0తో ఆధిక్యం అందించారు. తొలుత ధావన్‌ (72; 39 బంతుల్లో 10×4, 2×6) చెలరేగాడు. తర్వాత భువనేశ్వర్‌ (5/24) ఐదు వికెట్ల ఘనత సాధించాడు. భారత్‌ తరఫున టెస్టులు, వన్డేలు, టీ20ల్లో ఐదు వికెట్ల ఘనత నెలకొల్పిన తొలి ఆటగాడిగా రికార్డు కూడా నెలకొల్పాడు. మరోపక్క పరుగుల యంత్రం, భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీకి గాయమైంది. దీంతో ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగే రెండో టీ20లో అతడు ఆడటంపై ఇప్పుడు అనుమానం నెలకొంది. భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం జరిగిన తొలి టీ20లో కోహ్లీ గాయపడ్డాడు. ఆదివారం జరిగిన తోలి టీ-20 లో కోహ్లీ బ్యాటింగ్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తూ గాయపడ్డాడు. అయితే అదృష్టవశాత్తూ చేతికి ఏమీ కాలేదు గానీ కాలి నొప్పితో కాస్త బాధపడిన కోహ్లీ(26) ఆ తర్వాత శంసి బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. అనంతరం దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ చేస్తున్న క్రమంలో 13వ ఓవర్ల్లో కోహ్లీ కాలి నొప్పి మరీ ఎక్కువ కావడంతో ఫీల్డింగ్‌ చేయలేక మైదానన్ని వీడాడు. దీనితో కోహ్లీ రెండో టీ-20 లో ఆడతాడా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.