కేంద్రంపై అవిశ్వాసం.. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే!

వాస్తవం ప్రతినిధి: కేంద్రంలోని ఎన్డీయే సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ మేరకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ఏపీ కాంగ్రెస్‌ నేతలు ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తా కథనాలస్తున్నాయి. విభజన సమస్యలపై 184 నిబంధన కింద ఇప్పటికే కాంగ్రెస్‌ నోటీసిచ్చిన విషయం తెలిసిందే. టిడిపి కలిసొస్తే మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని పెడతామని ప్రకాశం జిల్లా కందుకూరు ప్రజా సంకల్ప యాత్రలో వైసిపి నేత జగన్‌ ఆదివారం ప్రకటించారు. ఈ విషయంలో టిడిపిని ఒప్పించేందుకు జనసేన అధినేత పవన్‌ చొరవ తీసుకోవాలని సోమవారం జగన్‌ సూచించారు కూడా. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ కూడా అవిశ్వాస తీర్మానం పట్ల మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే అవిశ్వాసం పెట్టేందుకు రాహుల్ గాంధీ అంగీకరించినట్టు సమాచారం.