ఏపీ సి ఎం పై అత్యాచార అభియోగం…యువతి ఫిర్యాదు  

వాస్తవం ప్రతినిధి: అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేమా ఖండూ తనని అత్యాచారం చేసినట్లు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2008 జులైలో పేమా, మరో ముగ్గురు వ్యక్తులు కలసి తనపై సామూహిక అత్యాచారం చేసినట్లు ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఆ సమయంలో తాను స్పృహలో లేనని తెలిపింది. అయితే ఈ విషయంగా నేను పోలీసులకు చెప్పినా, ప్రజలకు చెప్పినా ఎవరూ నమ్మలేదని, నాపై అత్యాచారం జరిపినప్పుడు ఆయన సి ఎం పదవిలో లేరని ఆ యువతి తెలిపింది. అయితే ఇప్పుడు ఆయన సీఎం అయ్యేసరికి నా మాటలు ఎవ్వరూ నమ్మడం లేదు. దాంతో ఓ మహిళా న్యాయవాది సాయంతో జాతీయ మహిళా సంఘాన్ని ఆశ్రయించాను అని ఆ యువతి పేర్కొంది. అయితే ఇక్కడ కూడా నాకు న్యాయం జరగకపోతే నాలాంటి బాధితులు ఇంకెవర్నీ నమ్మలేరు. ఇదంతా నేను పబ్లిసిటీ కోసం చేస్తున్నానని సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు. పాపులారిటీ కోసం ఇంత నీచానికి దిగజారే మనిషిని కాను. న్యాయం కోసం నా తుదిశ్వాస వరకూ పోరాడుతూనే ఉంటాను అని ఆ యువతి తెలిపింది. అయితే బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలుస్తుంది.