ఎలాంటి రసాయనిక ఆయుధాలు ప్రయోగించలేదు అన్న టర్కీ

వాస్తవం ప్రతినిధి: సిరియాలోని ఆఫ్రిన్‌ నగరంపై అంకారా సైన్యం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడడమే కాకుండా రసాయనిక ఆయుధాల ప్రయోగానికి పాల్పడుతోందని విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తాము రసాయనిక ఆయుధాలు ప్రయోగించలేదని టర్కీ పేర్కొన్నది. సైన్యంపై వచ్చిన విమర్శలను టర్కీ అధ్యక్షుడి ప్రధాన సలహాదారు యాసిన్‌ అక్తే ఖండించారు. సిరియాలోని కుర్దు తిరుగుబాటుదారుల లక్ష్యంగా టర్కీ సైన్యం ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.